వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఆర్జీవీ త్వరలో శారీ సినిమాతో రాబోతున్నాడు. ఆరాధ్య దేవి మెయిన్ లీడ్ గా తెరకెక్కగా మార్చ్ 21న విడుదల కానుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా మల్లారెడ్డి కాలేజీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీవీని ఓ స్టూడెంట్ తాను మీకు పెద్ద ఫ్యాన్ అని ఒక్క హగ్ ఇమ్మని కోరగా మొదట ఆర్జీవీ నో చెప్పి, నేను అబ్బాయిలకు హగ్ ఇవ్వను, ఇప్పటివరకు ఒక్కసారి కూడా అబ్బాయిలకు హగ్ ఇవ్వలేదు. నేను అమ్మాయిలకే హగ్ ఇస్తాను అని చెప్పాడు.
అయితే ఆ స్టూడెంట్ స్టేజిపైకి వచ్చి ఆర్జీవీ సినిమాల గురించి ఎమోషన్‌గా మాట్లాడి వెళ్లిపోతుండగా పిలిచి మరీ ఆ స్టూడెంట్ కి హగ్ ఇచ్చాడు ఆర్జీవీ. దీంతో అక్కడున్నవాళ్లంతా అరుపులతో సందడి చేయగా ఆ అబ్బాయికి హగ్ ఇచ్చాక ఇంతవరకు నా లైఫ్ లో నేను కౌగిలించుకున్న ఏకైన మగాడు అతను అని తనదైన శైలీలో చెప్పారు ఆర్జీవీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read:రైతు నేస్తం ..శాస్త్రవేత్తలతో మంత్రి తుమ్మల