‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. లక్ష్మీ పార్వతి ఆమె కాదు-వర్మ

245
Ram Gopal Varma
- Advertisement -

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా సినీ రాజకీయవర్గాలలో ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ ఎలా ఉండబోతుంది.. సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు ముసురుకుంటాయోనని ప్రేక్షకులకు కూడా ఈ సినిమాపై ఆసక్తిగానే ఉంది.

Lakshmi's NTR

ఇక ఈ చిత్రంలో అత్యంత కీలకమైన లక్ష్మీ పార్వతి పాత్రకు ముంబై మోడల్ రుపాలీ సూరిని వర్మ ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ‘డ్యాడ్‌… హోల్డ్‌ మై హ్యాండ్‌’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన ఆమె నటనను చూసి వర్మ ఈ పాత్రకు రూపాలీని తీసుకున్నట్టు సమాచారం. కానీ ఈ వార్తలపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. “కొన్ని మీడియా వర్గాలలో మా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రకు మోడల్ రుపాలి సైన్ చేసిందని ఫేక్ న్యూస్ వస్తోంది. కానీ ఆమె ఈ సినిమాకు సంబంధించిన ఒక వ్యక్తి భార్య కు స్నేహితురాలు మాత్రమే. అని వర్మ తెలిపారు.

ఇటీవల తిరుపతిలో సినిమా పూజా కార్యక్రమాలు పూర్తైన విషయం తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి, సంక్రాంతి నాటికి సినిమాను సిద్ధం చేయాలన్నది వర్మ ఆలోచన. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను ఎవరు చేస్తున్నారన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు. చంద్రబాబు పాత్ర కోసం ఓ చిన్న హోటల్ కార్మికుడిని ఆయన ఎంపిక చేసుకున్నాడు. లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత జరిగిన సంఘటనలే ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

- Advertisement -