అజ్ఞాతవాసి….బహిరంగవాసి

219
RGV Counters Pawwan
- Advertisement -

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అజ్ఞాత‌వాసి మిక్స్‌డ్ టాక్‌ సొంతం చేసుకోగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. నేను ఓ పులిని మాత్రమే చూశాను. కోరలు, పంజాలేని పులిని ఇప్పటి వరకు చూడలేదు. పులి చారలు మారడం నన్ను ఆశ్చర్యం కలిగించిందంటూ ఎద్దేవ చేయగా తాజాగా మరో కామెంట్‌తో పవన్‌ను వదిలిపెట్టలేదు.

అజ్ఞాతవాసిసినిమాలోని ఓ పోస్టర్‌లో పవన్‌ ఫొటోకి బదులు తన ఫొటోని మార్ఫ్‌ చేసిన ఇమేజ్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పోస్టర్‌కి ‘బహిరంగవాసి’ అనే టైటిల్‌ పెట్డడం వైరల్‌గా మారింది. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ చమత్కారపు ఫొటోని చూసిన వారంతా నవ్వుకుంటూ, పవన్‌పై కౌంటర్లేయడం మాత్రం వర్మ మానడు అంటే, ఏముంది కాపీయేగా.. ఈ టైటిల్‌తో వర్మ సినిమా చేసినా చేసేస్తాడు అంటూ నెటిజన్లు కూడా చమత్కారంగా రిప్లైలు ఇస్తున్నారు.

దీంతో పాటు మియా మల్కొవా అనే పోర్న్‌స్టార్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. దీనికి ‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ పేరు పెట్టినట్లు వెల్లడించారు. మరోపక్క వెబ్ సిరీస్‌‘కడప’ తో బిజీగా ఉన్న వర్మ అక్కినేని నాగార్జునతో శివ 2 చేస్తున్నారు. అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాతోనూ వర్మ బిజీగా ఉన్నారు.

- Advertisement -