వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో మరో వివాదంతో రచ్చ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వర్మ కరోనా వైరస్‌పై సినిమా తీసేశారు. ఆ సినిమాకు ‘కరోనా వైరస్’ అని టైటిల్ పెట్టారు. సినిమా మొత్తాన్ని లాక్‌డౌన్ పీరియడ్‌లోనే షూట్ చేసినట్టు వర్మ తెలిపారు. ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ సినిమా యావత్తూ లాక్ డౌన్ కాలంలోనే తెరకెక్కించామని వర్మ వెల్లడించారు. కరోనా వైరస్ సబ్జెక్టుపై ప్రపంచంలో ఇదే తొలి చిత్రం అవుతుందని వర్మ పేర్కొన్నారు. తమ చిత్రంలోని నటీనటులు, సిబ్బంది సృజనాత్మకత చాటుకున్నారని, లాక్ డౌన్ కాలంలో వారి క్రియేటివిటీకి లాక్ డౌన్ లేకుండాపోయిందని చమత్కరించారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఫోటోను షేర్ చేశారు. కేసీఆర్ ఏలుబడిలో భౌతికదూరం ఇలా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. ఆ ఫోటోలో దంపతులు బెడ్రూంలో కూడా మాస్కులు ధరించి ఎంతో ఎడంగా కూర్చుని ఉండడం చూడొచ్చు. ఈ చిత్రం ట్రైలర్ ఈ నెల 26 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుందని వర్మ ట్వీట్ చేశారు.
MADE a feature film called “CORONAVIRUS” 👍it is shot entirely during LOCKDOWN Period💪. It will be WORLD’S FIRST FILM ON Coronavirus subject..Our actors and crew proved CREATIVITY cannot be LOCKED DOWN even in LOCKDOWN 🙏 Trailer tmrw 26th 5 PM #CORONAVIRUSFILM @shreyaset
— Ram Gopal Varma (@RGVzoomin) May 25, 2020
Physical distancing under the tutelage of KCR ..A pic from CORONAVIRUS film ..A CM creations Production ..Trailer release tmrw 26th 5 PM #CORONAVIRUSFILM pic.twitter.com/qNE80x5aEA
— Ram Gopal Varma (@RGVzoomin) May 25, 2020