‘కేజీఎఫ్ 2’ భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్‌గా రిలీజైన బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు, యశ్ యాక్టింగ్, యాక్షన్‌కు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్,బాలీవుడ్‌లో ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలనాల డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ‘కేజీఎఫ్ 2’ మూవీని మెచ్చుకుంటూ వరుస ట్వీట్లు పెట్టారు.
‘ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ 2 చిత్రం గ్యాంగ్‌స్టర్ సినిమా కాదు. బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇది ఒక హారర్ మూవీ. కేజీఎఫ్ విజయం నుంచి బాలీవుడ్ తేరుకోవాలంటే కొన్నేళ్లు పడుతుంది. రాఖీ భాయ్ ముంబైకి వచ్చి గ్యాంగ్‌స్టర్స్‌పై మెషిన్ గన్‌తో దాడి చేసినట్లు యశ్ బాలీవుడ్ స్టార్స్ ఓపెనింగ్ కలెక్షన్లపై మెషిన్ గన్‌తో దండెత్తాడు. ఇక చివరి కలెక్షన్లతో శాండల్‌వుడ్ నుంచి బాలీవుడ్‌పైకి అణుబాంబుతో దాడి చేస్తాడు.
కేజీఎఫ్ విడుదలయ్యే వరకు బీటౌన్ మాత్రమే కాదు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు కూడా కన్నడ సినీ ఇండస్ట్రీని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ప్రశాంత్ నీల్ ఆ ఇండస్ట్రీని ప్రపంచ మ్యాప్‌లో నిలబెట్టాడు.’ అంటూ ఆర్జీవీ ట్వీట్స్ చేశారు. ఇక విడుదలైన తొలిరోజే సుమారు ఈ సినిమా రూ. 135 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇందులో ఒక్క బాలీవుడ్‌లోనే దాదాపుగా రూ. 50 కోట్లను రాబట్టడం విశేషం.