‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌పై వర్మ షాకింగ్‌ కామెంట్స్‌..

80
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా మర్టీసార్‌గా తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’.ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ పై వర్మ తన మార్క్ సెటైర్స్ వేశారు.

ఈ సినిమా ట్రైలర్‌ను చూసాను బాగుంది. కానీ ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ కాకుండా.. ‘డేనియల్ శేఖర్’ అనే పేరు పెడితే బాగుంటుందని చెప్పారు. ఈ ట్రైలర్ చూస్తుంటే రానాను ప్రమోట్ చేయడానికి పవన్ కల్యాణ్ ను ఉపయోగించుకున్నారేమోనని అనిపిస్తోందని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ అభిమానిగా తాను చాలా బాధపడ్డానని చెప్పారు.

మరోవైపు ‘భీమ్లా నాయక్’ను తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేస్తున్నారు కదా. ఈ సినిమాలో నటించిన రానా దగ్గుబాటి.. ‘బాహుబలి’ సినిమాలో భళ్లాల దేవుడిగా నేషనల్ వైడ్‌గా పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ మంది తెలుసు. మేకర్స్ ఈ విషయంలో జర జాగ్రత్తగా ఉండాలన్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ .. రామ్ గోపాల్ వర్మపై ఊగిపోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. విడుదలైన 17 గంటల్లో 10 మిలియన్ వ్యూస్‌కు పైగా రాబట్టింది.

- Advertisement -