చంద్రబాబుకు ఆర్జీవీ సవాల్‌..టైమ్,డేట్ ఫిక్స్‌..!

341
rgv chandrabau
- Advertisement -

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. బాబుపై తాను ప్రతీకారం తీర్చుకోబోతున్నానని సవాల్ విసిరిన ఆర్జీవీ టైం,డేట్ కూడా ఫిక్స్‌ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఈ నెల 31 విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు బాబుకు ట్వీట్‌ల మీద ట్విట్లు పెడుతూ బస్తీమే సవాల్ అంటూ చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు.

ఇటీవల ఆర్జీవీ విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రెస్‌మీట్ పెట్టడానికి ప్రయత్నించగా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తనని అడ్డుకోడానికి చంద్రబాబే కారణమని ఆరోపణలు చేశారు. ఇక బాబు ఓడిపోయి వైసీపీ అధికారంలోకి రావడంతో ఆనందంలో ఉన్న వర్మ ఎక్కడయితే మాజీ సీఎం నన్ను అరెస్టు చేయించి విజయవాడ నుంచి వెళ్లగొట్టారో అదే పైపుల రోడ్డులో ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర ఎల్లుండి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్‌ మీట్‌ పెట్టబోతున్నాను అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌ నిజమైన అభిమానులకి ఇదే నా బహిరంగ ఆహ్వానం.. జై జగన్‌ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

rgv

ఎట్టకేలకు అతని నిజాన్ని చెప్పబోతున్నా. మే 31న నా ప్రతీకారాన్ని తీర్చుకోబోతున్నా.. చంద్రబాబు ప్రజెంట్ పొజీషన్ ఇదేనంటూ గతంలో చంద్రబాబు పోలికలతో ఉన్న వ్యక్తి వైరల్ వీడియోను వర్మ పోస్ట్ చేశారు.

- Advertisement -