వర్మ మొబైల్‌,లాప్‌టాప్‌ సీజ్‌..

229
RGV Attends CCS Investigation Mobile And Laptop Seized
- Advertisement -

దర్శకుడు రామ్ గోపాల్ వర్మను నేడు సీసీఎస్ పోలీసులు విచారించారు. ‘జీఎస్టీ’ సినిమాలో అశ్లీలత, మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించిన విచారణ కొద్దిసేపటిక్రితమే ముగిసింది. విచారణ సందర్భంగా వర్మపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తం 24 ప్రశ్నలకు పోలీసులు వివరణ కోరినట్టు సమాచారం.

దాదాపు 3 గంటల 20 నిమిషాల పాటు కొనసాగిన ఈ విచారణనంతరం వర్మకు మరో నోటీసును అందజేశారు.

 RGV Attends CCS Investigation Mobile And Laptop Seized

శుక్రవారం కూడా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఆయన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారు. వర్మకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎలాంటివారితో సంబంధాలు ఉన్నాయి తదితర అంశాలకు సంబంధించిన వివరాలు వీటిలో లభించే అవకాశం ఉన్నందున… పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -