- Advertisement -
ఒంగోలు రూరల్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. రాంగోపాల్ వర్మ ను విచారించారు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు.
చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు ఆర్జీవీ. 2024, నవంబర్ 10న మద్దిపాడు పీఎస్‌లో ఆర్జీవీపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
అయితే గతంలోనూ పలుమార్లు ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ సమయంలో విచారణకు హాజరుకాలేదు. అనంతరం హైకోర్టును ఆశ్రయించడంతో ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలంటూ రామ్గోపాల్ వర్మకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే గత నెలలో పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Also Read:బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం!
- Advertisement -