దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా వారణాసి మూవీపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోని షేర్ చేయగా ఆ వీడియోలో రాజమౌళి – మహేష్ బాబు ‘వారాణసి’ సినిమా కోసం కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఒకరితో ఒకరు భారీగా కొట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
అయితే, నిజంగా వాళ్లు గొడవపడలేదు. అది పూర్తిగా AI సృష్టించిన (AI-generated) వీడియో. మొదటి చూపులో నిజంగానే ఇద్దరూ ఫిజికల్ ఫైట్ చేస్తున్నట్లు అనిపించినా, అది కృత్రిమ మేధస్సుతో రూపొందించిన వీడియో అని స్పష్టమైంది. అందుకే రామ్ గోపాల్ వర్మ ఆ వీడియోకు “CINEMA IS DEAD” అంటూ క్యాప్షన్ పెట్టారు — అంటే, AI టెక్నాలజీ పెరుగుదలతో సంప్రదాయ సినిమా ప్రమాదంలో ఉందనే భావనను వ్యక్తం చేశారు.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమా కాదు… దర్శకులు, నిర్మాతలు, కళాకారులే ‘డెడ్’. పాజిటివ్‌గా చూడాలి. ఎవరైనా సినిమా తీసే అవకాశం ఉంది. మంచి కథ ఉంటే AIతో ముందుగా సీన్ ట్రై చేసి తర్వాత చిత్రీకరించొచ్చు అని పేర్కొనగా మరొక యూజర్
మేము బాగా ఎంజాయ్ చేశాం సర్. మహేష్ బాబు ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివే మిస్సవుతున్నాం. థ్యాంక్స్ AI అని చెప్పుకొచ్చాడు.
https://x.com/RGVzoomin/status/2026141775849726006?
Also Read:TG:తెలంగాణ రెయిన్ అలెర్ట్!

