నోటా చిత్రంతో డీలాపడ్డ విజయ్ దేవరకొండ హిట్ ట్రాక్ ఎక్కేందుకు ‘టాక్సీవాలా’ అంటూ స్టీరింగ్ పట్టుకున్నారు. తొలిసారిగా సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీతో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజయ్…ట్యాక్సీవాలాతో హిట్ ట్రాక్ ఎక్కాడా..?సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం…….
కథ:
శివ (విజయ్ దేవరకొండ) అతికష్టం మీద డిగ్రీ చదివి పూర్తిచేసి ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. ఒకటి రెండు ఉద్యోగాల్లో చేరి మానేస్తాడు. ఈ క్రమంలో సొంతంగా ఓ కారు కొని ట్యాక్సీ డ్రైవర్‌గా మారుతాడు. తొలి రైడ్‌లోనే అను అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో ఆ టాక్సీలో దెయ్యం ఉందని తెలుస్తుంది. అసలు ఆ కారులోకి దెయ్యం ఎలా వచ్చింది..?కారు తన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నదే ట్యాక్సీవాలా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ విజయ్ దేవరకొండ,కామెడీ. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. సన్నివేశాలకు తగ్గట్టుగా నటించి ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో విజయ్ నటన సూపర్బ్. ట్యాక్సీవాలాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ప్రియాంక గ్లామర్ రోల్‌లో ఆకట్టుకుంది. మాళవిక నాయర్,హీరో ఫ్రెండ్‌గా నటించిన మధుసూదన్ మంచి కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ పాటలు,గ్రాఫిక్స్,సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్. దెయ్యం పగతీర్చుకునే కాన్సెప్ట్‌తో తెరకెక్కగా నెక్ట్స్ సన్నివేశం ఎంటో ముందుగానే ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడ్డాయి. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది సినిమాటోగ్రఫి. సుజిత్ సారంగ్ సినిమా మూడ్‌కు తగ్గ విజువల్స్‌తో మెప్పించాడు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
సూపర్‌నేచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ట్యాక్సీవాలా. తొలి సినిమానే థ్రిల్లర్ మూవీని ఎంచుకున్న రాహుల్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు. విజయ్ నటన,కామెడీ సినిమాకు ప్లస్ కాగా గ్రాఫిక్స్,కొన్ని సన్నివేశాలు మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు విజయ్ దేవరకొండ.
విడుదలతేదీ:17/11/18
రేటింగ్:2.5/5
నటీనటులు: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్
సంగీతం : జాక్స్ బెజోయ్
నిర్మాత : ఎస్‌కేయన్
దర్శకత్వం : రాహుల్ సంక్రిత్యాన్