రివ్యూ : పటేల్ సర్

329
Review Patel SIR
- Advertisement -

ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసిన జగపతిబాబు.. ‘లెజెండ్’ మూవీలో విలన్‌గా తనలో ఉన్న మరో యాంగిల్‌ను నిద్రలేపి.. ప్రతినాయకుడి పాత్రకు తొలి ఆప్షన్‌ జగ్గుభాయ్ అనే రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. విలన్‌గా ఆకట్టుకుంటున్న జగపతిబాబు ‘పటేల్ సార్’ చిత్రంతో మరోసారి లీడ్ రోల్ చేయబోతున్న విషయం తెలిసిందే. వారాహి బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. హీరోగా ఫుల్‌ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జగ్గూభాయ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం.

కథ :

దేవరాజ్ అలియాస్ డీఆర్ (కబీర్ దుహాన్ సింగ్) తన తమ్ముడు కన్నా తయారు చేసిన సింథటిక్ డ్రగ్ ను దేశంలోని యువత మొత్తానికి అలవాటు చేయాలని ప్లాన్ చేస్తాడు. అందుకోసం తన ఫ్రెండ్స్ మౌంటీ(పృథ్వీ), ఛోర్ బజార్ లాలా( కాలకేయ ప్రభాకర్)లతో కలిసి భారీ స్కెచ్ వేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ రవి ఎలాగైన డీఆర్ గ్యాంగ్ ను పట్టించాలని సాక్ష్యాధారాలు రెడీ చేస్తాడు. ఈ లోగా విషయం తెలుసుకున్న డీఆర్, రవిని చంపేస్తాడు. రవి చనిపోయిన కొద్ది రోజుల తరువాత డీఆర్ గ్యాంగ్ లోని చోర్ బజార్ లాలాను  పటేల్ సర్(జగపతి బాబు)  చంపేస్తాడు. వీరితో పాటు డీఆర్,ఆయన తమ్ముడిని కూడా అంతమొందిస్తాడు. అసలు పటేల్ సర్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు..?  చివరకు పటేల్ సర్ ఏమయ్యాడు అన్నదే సినిమా కథ.

Review Patel SIR
ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్  జగపతిబాబు నటన,ఇంటర్వెల్ సీన్‌, క్లైమాక్స్ ట్విస్ట్స్. వన్ మేన్‌ షోగా సినిమా అంతా జగపతిబాబు ముందుండి నడిపించాడు. క్రూరంగా హత్యలు చేసే పటేల్ సర్ గా, యంగ్ డాక్టర్ వల్లభ్ పటేల్ గా జగపతి బాబు నటన సినిమాకే హైలైట్. స్టైలిష్ విలనిజంతో కబీర్ దుహన్ సింగ్ మరోసారి మెప్పించాడు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఆమని, పద్మప్రియ, పృథ్వీ, సుబ్బరాజు, కాలకేయ ప్రభాకర్, శుభలేఖ సుధాకర్, పోసాని కృష్ణ మురళీ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్  స్లో నేరేషన్, పూర్ టేకింగ్,పూర్ టేకింగ్,క్వాలిటీ లేని గ్రాఫిక్స్. పూర్తి యాక్షన్ సినిమాగా రూపొందించే ప్రయత్నంలో ఎమోషనల్ సీన్స్ కు అవకాశామున్నా అలాంటి సీన్స్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. జగపతి బాబు క్యారెక్టర్‌కు తప్ప మిగితా పాత్రలన్నింటికీ స్క్రీన్ టైం చాలా తక్కువ. మంచి కథతో పాటు జగపతిబాబు లాంటి నటుడు ఉన్నా సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయాడు.  అంత‌మంది విల‌న్లు ఉన్నా, విల‌నిజం మాత్రం బ‌లంగా పండ‌క‌పోవ‌టం లోటే.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులు ప‌డ‌తాయి. సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం, మాట‌లు బాగున్నాయి. ద‌ర్శ‌కుడు తాను అనుకొన్న క‌థ‌ను అనుకున్న‌ట్లే తీయ‌గ‌లిగాడ‌నిపిస్తుంది. క‌థ‌నం కోసం క‌స‌ర‌త్తు జ‌రిగిన‌ట్లుగా క‌నిపిస్తుంది కానీ, అవి మ‌రింత ఉంటే బాగుండేది. ప‌టేల్  ప్ర‌తినాయ‌కుల్ని చంపే క్ర‌మం సాదాసీదాగా అనిపిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో మ‌రింత ఆస‌క్తిక‌రంగా సాగాల్సింది. వారాహి సంస్థ త‌ర‌హాలోనే నిర్మాణ విలువ‌లు తెర‌పై క‌నిపించాయి.

Review Patel SIR
తీర్పు :

హీరోగా కుటుంబ క‌థ‌లతో, ఇటు యాక్ష‌న్ క‌థ‌ల‌తోనూ  అల‌రించిన హీరో జగపతిబాబు. లెజెండ్ సినిమాతో స్టైలిష్‌ విలన్‌గా మారిన జగపతి చాలాకాలం తర్వాత హీరోగా నటించిన సినిమా పటేల్ సర్. జగపతి బాబు నటన, క్లైమాక్స్ సీన్స్ సినిమాకు ప్లస్ కాగా స్లో నేరేషన్, క్వాలిటీ లేని గ్రాఫిక్స్‌ సినిమాకు మైనస్ పాయింట్. మొత్తంగా  ప్రతీకారం నేపథ్యంగా సాగే జగపతి మార్క్ మూవీ పటేల్ సర్.

విడుదల తేదీ: 14/07/2017
రేటింగ్ : 2.5/5
నటీనటులు : జగపతిబాబు, పద్మప్రియా
సంగీతం : డీజే వసంత్
నిర్మాత : సాయి కొర్రపాటి
దర్శకత్వం : వాసు పరిమి

- Advertisement -