రివ్యూ : మళ్ళీ రావా

264
Review Malli Raava
- Advertisement -

అక్కినేని ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయమైన హీరో సుమంత్. కెరీర్‌ తొలినాళ్లలో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో హిట్‌కు దూరమైన సుమంత్ చాలాకాలం తర్వాత నరుడా డోనరుడా సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీసు ముందు బోల్తాపడింది. తాజాగా మళ్లీ రావా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్‌..ఈ మూవీతో హిట్ కొట్టాడా..?లేదా చూద్దాం.

కథ :

కార్తీక్(సుమంత్) 14 ఏళ్ల వయసులో అంజలి(ఆకాంక్ష సింగ్)ని చూస్తాడు. మొదటి చూపులోనే కార్తీక్‌కు ఏదో తెలియని అనుభూతి. అంజలిని ఎంతగానో ఇష్టపడతాడు. అంజలి కూడా కార్తీక్‌ను ఇష్టపడుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల అంజలి.. కార్తీక్‌ను వదిలేసి వెళ్లిపోతుంది. మళ్లీ 13 ఏళ్ల తరువాత ఓ పని నిమిత్తం కార్తీక్ ఉద్యోగం చేస్తున్న ఆఫీస్‌‌కు అంజలి వస్తుంది. ఆమెను గుర్తుపట్టిన కార్తీక్ మరోసారి తన ప్రేమను గెలిపించుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఏం జరుగుతుంది..?కార్తీక్ ప్రేమకు అంజలి ఓకే చెబుతుందా..?వీరిద్దరు కలుస్తారా లేదా అన్నదే కథ.

Review Malli Raava
ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్‌ స్క్రీన్ ప్లే,హీరో,హీరోయిన్‌ల నటన.ఓ సింపుల్ లవ్‌ స్టోరీని కథగా మార్చి ప్రేక్షకులకు నచ్చేలా తీయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. చాలా కాలం తర్వాత సుమంత్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో నటించాడు.తనదైన నటనతో సుమంత్  ఈజ్ బ్యాక్‌ అనిపించేలా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక సినిమాకు మరో హైలైట్‌ హీరోయిన్ ఆకాంక్ష. తన నటనతో ఆకట్టుకుంది. మిగితా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ స్లో నేరేషన్.  ఆరంభం నుండి చివరి వరకు ప్రేమ పరంగా సినిమాను పైకి లేపే సన్నివేశాలు రెండు మాత్రమే ఉంటాయి. అలా కాకుండా ఇంకొన్ని సన్నివేశాలని రూపొందించి ఉంటే అంటే హీరో తాలూకు బాధను ఇంకాస్త ప్రభావితంగా చూపించి ఉంటే బాగుండేది. చిన్ననాటి ప్రేమ  లెంగ్త్ ను తగ్గిస్తే బాగుండేది.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. టెక్నికల్‌గా కూడా సినిమాను అత్యుత్తమ నాణ్యతతో నిర్మించారు. సినిమాకు సంగీతం మరో బలంగా నిలిచింది. ఎలాంటి డ్యూయెట్స్ లేకుండా పాటలు కథతో ట్రావెల్ అవుతూ చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Review Malli Raava
తీర్పు :

చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సుమంత్‌ తాజాగా చేసిన ప్రయత్నమే మళ్ళీ రావా. కథ,స్క్రీన్ ప్లే, సుమంత్,ఆకాంక్ష నటన సినిమాకు ప్లస్ కాగా స్లో నేరేషన్ సినిమాకు మైనస్.  సుమంత్ చాలా కాలం తరువాత ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్‌ అయ్యాడు.  మొత్తంగా మళ్ళీ చూడాలనిపించే సుమంత్ మార్క్ మూవీ మళ్ళీ రావా.

విడుదల తేదీ : 08/12/17
రేటింగ్ : 3.25/5
నటీనటులు : సుమంత్, ఆకాంక్ష సింగ్
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్
నిర్మాత : రాహుల్ యాదవ్ నక్క
దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి

- Advertisement -