రివ్యూ:లక్ష్మీస్ ఎన్టీఆర్

538
laxmis ntr review
- Advertisement -

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాలకు కేరాఫ్‌గా మారింది. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనలు లక్ష్మీ పార్వతికి ఎదురైన అవమానాలు, ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమానురాగాలను నేపథ్యంలో సాగిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో ఆర్జీవీ మెప్పించాడా లేదా చూద్దాం…

Image result for laxmis ntr review

కథ:

1989లో ఎన్టీఆర్‌ అధికారం కోల్పోయిన సమయంలో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్‌ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ (యజ్ఞ శెట్టి) వస్తుంది. ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర రాసేందుకు అనుమతిస్తారు. అయితే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన కొద్దిరోజుల్లోనే దుష్ప్రచారం మొదలవుతుంది. దీంతో మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్‌లో లక్ష్మీపార్వతిని పెళ్లిచేసుకోబోతున్నట్లుగా ప్రకటిస్తాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్‌ అల్లుడైన బాబు రావ్‌ ఓ పత్రికా అధిపతితో కలిసి లక్ష్మీ పార్వతి మీద చెడు ప్రచారం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..?ఎన్టీఆర్ సీఎం పదవి ఎలా కొల్పోతాడు..?వైశ్రాయ్‌ హోటల్ దగ్గర ఏం జరుగుతుంది…అన్నదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,కథనం,సంగీతం,ఎమోషనల్ సీన్స్‌. ఈ సినిమా కోసం వర్మ ఎంచుకున్న ప్రధాన పాత్రదారులంతా కొత్తవారే. ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించిన విజయ్ కుమార్‌ రంగస్థల నటుడు. ఎన్టీఆర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. వర్మ తనమీద పెట్టుకున్న నమ్మకానికి వందశాతం న్యాయం చేశాడు. మరో కీలక పాత్రలో నటించిన యజ్ఞశెట్టి నటన సినిమాకు హైలెట్‌. బాధ,వేదన,అవమానభారం అన్నిభారాలను తెరమీద అద్భుతంగా పలికించింది. ఎన్టీఆర్‌, లక్ష్మీల మధ్య సన్నివేశాలు సినిమాను మరోస్ధాయికి తీసుకెళ్లాయి. మిగితా నటీనటులు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ అక్కడక్కడా నెమ్మదించిన కథనం.

Image result for laxmis ntr review

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. వర్మ మార్క్‌ టేకింగ్ సినిమాకు ప్రధాన బలం.పాత్రల ఎంపికతోనే సగం విజయం సాదించిన వర్మ.. వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవటంలోనూ సక్సెస్‌ అయ్యాడు. కల్యాణీ మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌ బాగుంది. రాకేశ్ రెడ్డి నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ముందు నుంచి చెపుతున్నట్టుగా వర్మ ఎన్టీఆర్ జీవితంలోని అసలు నిజాలను ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం చేశాడు. వర్మ చేసిన ప్రయత్నం వందశాతం సక్సెస్ అయింది. మొత్తంగా ఎన్టీఆర్‌ని అభిమానించే వారికి నచ్చే మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్.

విడుదల తేదీ:29/03/2019
రేటింగ్: 2.75 /5
నటీనటులు : విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి
సంగీతం : కల్యాణీ మాలిక్‌
నిర్మాత : రాకేష్‌ రెడ్డి
దర్శకత్వం : రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు

- Advertisement -