వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా నటించిన చిత్రం కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త. యువతను ఆకట్టుకోవడంపై ప్రధానంగా సాగే రాజ్ తరుణ్ చిత్రాలంటే ఎంతో క్రేజ్. సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలు ఆ కోవలోనివి. దొంగాట ఫేం వంశీ కృష్ణ దర్శకత్వంలో కుక్కలను కిడ్నాప్ చేయడం అనే నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. రాజ్ తరుణ్ సరసన అను ఎమ్మాన్యుయెల్ నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది. మరి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో రాజ్ తరుణ్ ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..
కథ:
కిట్టు(రాజ్‌తరుణ్) మెకానికల్ ఇంజనీర్. స్నేహితులతో కలసి ఓ గ్యారేజీ నడుపుతుంటాడు. అనుకోకుండా జానకి(అను ఇమ్మాన్యుయేల్)ని కలుస్తాడు. ఆమె మంచితనం నచ్చడంతో ప్రేమిస్తాడు. జానకి కోసమే అనుకోకుండా కుక్కల కిడ్నాపర్ అవతారం ఎత్తుతాడు. బడాబాబుల కుక్కల్ని ఎత్తుకెళ్లి .. డబ్బులు డిమాండ్ చేస్తుంటాడు. ఈ విషయం జానకికి తెలిసిపోతుంది. దాంతో కిట్టూ, జానకి విడిపోతారు. తర్వాత అనుకోని నేరంలో కిట్టు ఇరుక్కుంటాడు. దాని నుంచి కిట్టు ఎలా బయటపడ్డాడు..? తన ప్రేమని ఏ విధంగా సాధించుకున్నాడు..? చివరికి కథ ఎలా సుఖాంత మవుతందనేదే సినమా స్టోరీ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కుక్కలను కిడ్నాప్ చేసే సన్నివేశాలు , పృథ్వీ కామెడీ, సెకండాఫ్. రాజ్‌తరుణ్ మరోసారి ఎనర్జిటిక్ పాత్రలో కనిపించారు. నటనలో కానీ, డైలాగ్ డెలివరీలో తనదైన పర్ఫామెన్స్ చూపించాడు. అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్‌గా కనిపించింది. తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించింది. అర్ఫాజ్‌ఖాన్ పాత్రను చివరికి తేల్చేశారు. నాగబాబు, వెన్నెల కిషోర్, రాజా రవీంద్ర తమ తమ పాత్రల్లో ఓకే అనిపిస్తారు. అయితే ఎక్కువగా నవ్వులు పంచింది మాత్రం పృథ్వీనే. రేచీకటి ఉన్నా, దాన్ని కవర్ చేసుకునే పాత్రలో పృథ్వీ నటన అలరిస్తుంది. దొంగబాబాగా రఘుబాబు, నవ్విస్తాడు.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్, క్లైమాక్స్. పతాక సన్నివేశాలు సుదీర్ఘంగా సాగాయి. విలన్ పాత్ర తేలిపోయింద. ఐటీశాఖ సీజ్ చేసిన లాకర్‌ను తీసుకెళ్లేపోయే ఎపిసోడ్ సిల్లీగా చూపించారు. కథలో కొత్తదనం లేకపోయిన సన్నివేశాల్లో వినోదం జోడించటంతో సినిమా సాఫీగా సాగిపోతుంటుంది.
సాంకేతిక విభాగం :
బి రాజశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్‌రూబెన్స్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. స్టోరీ పాతదే అయినా దర్శకుడు వెండితెరపై ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. నటీనటుల నుంచి కావాల్సిన నటన రాబట్టడంలో సక్సెసయ్యాడు. అయితే ఐటమ్ సాంగ్ అంతగా కిక్ ఇవ్వలేదు. నేపథ్యం సంగీతం సినిమాకు తగినట్టు సాగింది. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అక్కడక్కడా అలరిస్తాయి. కెమేరా, ఎడిటింగ్ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
తొలి చిత్రం ‘ఉయ్యాలా జంపాలా’ నుంచి తనదైన శైలిలో చిత్రాలను చేస్తూ ఆకట్టుకుంటున్న యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజ్ తరుణ్ కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్తతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడనే చెప్పాలి. కామెడీ, కుక్కలను కిడ్నాప్ చేసే సన్నివేశాలు, పృథ్వీ కామెడీ సినిమాకు ప్లస్ కాగా హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్, రోటిన్ సన్నివేశాలు మైనస్ పాయింట్స్. మొత్తంగా టైంపాస్ చేసే మూవీ కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త.
విడుదల తేదీ:03/03/2017
రేటింగ్: 3/5
నటీనటులు: రాజ్‌తరుణ్, అను ఇమ్మాన్యుయేల్
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
దర్శకత్వం: వంశీకృష్ణ