‘ప్రేమించుకుందాం.. రా’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘బావగారు బాగున్నారా!’ ‘లక్ష్మీనరసింహా’ వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించి డీసెంట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జయదేవ్. లవ్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్ అవకుండా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చిత్రాలను రూపొందిస్తూ తనకంటూ సెపరేట్ మార్క్‌ని క్రియేట్ చేసుకున్న జయంత్.. చాలాకాలం గ్యాప్ తర్వాత ‘జయదేవ్’తో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఈ సినిమా ద్వారా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా పరిచయమవుతున్నాడు. తమిళంలో ఘన విజయాన్ని సాధించిన ‘సేతుపతి’ చిత్రాన్ని తెలుగులో ‘జయదేవ్’గా తీసుకొచ్చారు. మరి తొలి చిత్రంతోనే రవి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారా? లేదా చూద్దాం…
కథ:
జయదేవ్(గంటా రవి) పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఎలాంటి ప్రలోభాలకు లొంగడు. పక్క గ్రామంలో శ్రీరామ్(రవిప్రకాష్) అనే పోలీస్ ఆఫీసర్ హత్యకు గురవుతాడు. ఆ కేసు జయదేవ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుంది. శ్రీరామ్ హత్య వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ ప్రారంభిస్తాడు జయదేవ్. ఈ క్రమంలోఆ గ్రామంలో మస్తాన్‌బాబు (వినోద్‌కుమార్) అనేక దుర్మార్గాలకు పాల్పడుతుంటాడు. అతనికి సంబంధించిన సాక్ష్యాలు సేకరించినందుకే శ్రీరామ్‌ను హత్య జరిగిందన్న విషయం తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది…? శ్రీరామ్ కుటుంబానికి జయదేవ్ న్యాయం జరిగిందా? మస్తాన్‌బాబు కటకటాల పాలయ్యాడా లేదా అన్నదే కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ మాటలు, యాక్షన్ ,పోలీసులకు సంబంధించిన సన్నివేశాలు. తొలి సినిమాతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు రవి. ఎమోషన్స్ సన్నివేశాల్లో బాగా కనిపించిన రవి మిగిలిని విషయాల్లో ఇంకా రాటుదేలాలి. హీరోయిన్‌ని గ్లామర్‌గా చూపించారు. చాలాకాలం తర్వాత వినోద్‌కుమార్ కీలకమైన పాత్రలో తెరమీద కనిపించాడు. వెన్నెల కిషోర్.. పరుచూరి వెంకటేశ్వరరావు.. శివారెడ్డిలు తమ పరిధి మేర నటించారు.వెన్నెల కిషోర్.. బిత్తిరి సత్తితో నవ్వులు పండించే పయత్నం చేశారు. యాక్షన్ సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా తీర్చిదిద్దండంతో పాటు పోలీసుల గురించి చెప్పిన మాటలు ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ కథ,కథనం ,కామెడీ లేకపోవడం. తమిళంలో హిట్టైన సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మలచకపోవడం. ఎమోషన్ సన్నివేశాల్లో హీరో ఆకట్టుకున్న హీరోయిన్‌తో మాత్రం లవ్ ట్రాక్ సరిగా పండలేదు. పాటలు బోర్ కొట్టిస్తాయి. కథను ముందుకు నడిపించే ఎలిమెంట్స్.. ఉత్కంఠ పెద్దగా లేకపోవడంతో సినిమా సెకండాఫ్ నెమ్మదించింది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా చూస్తే మణిశర్మ సంగీతంలో మెరుపులు లేవు. కానీ నేపథ్య సంగీతం బాగుంది. యాక్షన్ దృశ్యాలను భారీగా తీశారు. పతాక సన్నివేశాల్లో మళ్లీ ఎమోషన్స్ పండించే ప్రయంత్నం చేశాడు దర్శకుడు. అడుగడుగునా నిర్మాణ విలువలు కనిపించాయి. తమిళంలో ‘సేతుపతి’ మంచి విజయం సాధించింది. అయితే అక్కడ చాలా అంశాలు అందుకు తోడ్పడ్డాయి. అయితే మన నేటివిటికి తగ్గట్లుగా మార్చుకోకపోవటం ‘జయదేవ్’లో కనిపిస్తుంది.
తీర్పు :
చాలా కాలం గ్యాప్ తర్వాత జయంత్ సి పరాన్జీ తెరకెక్కించిన రిమేక్ మూవీ జయదేవ్. మాటలు, యాక్షన్ ,పోలీసులకు సంబంధించిన సన్నివేశాలు సినిమాకు ప్లస్ కాగా తెలుగు నేటివిటి లోపించడం, కథ,కామెడీ లేకపోవడం సినిమాకు మైనస్ పాయింట్స్. తొలి సినిమాతోనే గంటా రవి తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మొత్తంగా యాక్షన్ సన్నివేశాలతో మాస్‌ని మెప్పించే సినిమా జయదేవ్.
విడుదల తేదీ: 30/06/2017
రేటింగ్ : 2.5/5
నటీనటులు: గంటా రవి,మాళవిక రాజ్
సంగీతం: మణిశర్మ
నిర్మాత: కె. అశోక్‌కుమార్
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ