జై బోలో తెలంగాణ వంటి చిత్రం తర్వాత శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మలయాళ సూపర్ హిట్ సినిమా “2 కంట్రీస్”కి అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం “2 కంట్రీస్”. సునీల్ సరసన మనీషా రాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, శ్రీనివాసరెడ్డి, పృధ్వీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. చాలాకాలం తర్వాత 2 కంట్రీస్‌తో వచ్చిన శంకర్‌కు ఈ సినిమా హిట్ ఇచ్చిందా..?సునీల్ సక్సెస్ బాట పట్టాడా లేదా చూద్దాం..
కథ:
డబ్బుకోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పే రకం ఉల్లాస్(సునీల్). అందుకోసం సొంత కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. డబ్బు కోసం పటేల్(షాయాజి షిండే) కూతురుని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. చివరికి ఆ డబ్బు కోసమే ఆమెను కాదని, అమెరికాలో ఉన్న లయ(మనీషారాజ్)కు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటాడు. భార్యతో కలిసి అమెరికాకు వెళ్లాక అతని బండారం ఎలా బయటపడింది. ఉల్లాస్-లయ వివాహం బంధం నిలిచిందా? లేదా? ఉల్లాస్ తన భార్య కోసం ఏం చేశాడు..? తన తప్పును ఎలా సరిదిద్దుకున్నాడు అన్నదే కథ!
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ సునీల్ నటన,విజువల్స్. సునీల్..ఉల్లాస్ పాత్రలో అద్బుతంగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో సునీల్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. లయ పాత్రలో మనీషా రాజ్ నటన సూపర్బ్. సునీల్‌తో పోటీ పడి నటించింది. షియాజీ షిండే,నరేష్,రాజా రవీంద్ర తమ పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. పృథ్వి,శ్రీనివాస్ రెడ్డి, జబర్దస్త్ నటుల కామెడీ పర్వాలేదనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ రోటిన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, కామెడీ లేకపోవడం. రిమేక్ మూవీని తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా తెరకెక్కించడంలో శంకర్ కాస్త తడబడ్డాడనే చెప్పాలి.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. గోపి సుందర్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీకి వంకపెట్టలేం. అద్బుతమైన విజువల్స్‌ని ప్రేక్షకులకు చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ పర్వాలేదు. మహాలక్ష్మీ ఆర్ట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
మలయాళంలో సూపర్ హిట్ అయిన 2 కంట్రీస్‌కు రిమేక్‌గా అదే పేరుతో సునీల్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. సునీల్ నటన, విజువల్స్ సినిమాకు ప్లస్ కాగా రోటిన్ స్టోరీ,కామెడీ లేకపోవడం మైనస్. ఓవరాల్‌గా పర్వాలేదనిపించే శంకర్-సునీల్ సినిమా 2 కంట్రీస్.
విడుదల తేదీ: 29/12/2017
రేటింగ్: 2.5/5
నటీనటులు:సునీల్,మనీషా రాజ్
సంగీతం:గోపి సుందర్
నిర్మాత,దర్శకత్వం: ఎన్.శంకర్