సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రోజు సోషల్ మీడియాలో ఎవరినో ఒకరిని గెలకడం.. మళ్లీ సారీ చెప్పడం వర్మ లైఫ్ స్టైల్.. లేదా తన సినిమాల గురించి సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప ఇప్పటివరకూ అభిమానులతో తన కుటుంబం గురించి పంచుకున్న విశేషాలు తక్కువే. ఆ మధ్య వర్మ చిన్నప్పుడు తన కుమార్తె రేవతి వర్మతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన కూతురు రేవతి జిమ్ చేస్తోన్న వీడియోను పోస్ట్ చేస్తూ “నా కూతురు నన్ను కొట్టేందుకు తనంతట తానే ట్రైనింగ్ అవుతోందంటూ కామెంట్ పెట్టాడు.
తన కూతురు పర్సనల్‌గా వీడియోని పంపిస్తే సోషల్ మీడియాలో పెట్టాడట వర్మ. దీనిపై వర్మకు వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఇదే విషయాన్ని వర్మ తెలిపాడు. “మీకు పర్సనల్ గా పంపిన వీడియోను సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేశారు?” అంటూ అసహనాన్ని వ్యక్తం చేసిందనీ, వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేయకపోతే అమెరికా నుంచి వచ్చి నిజంగానే కొడతానని మెసేజ్ పెట్టిందని వర్మ తెలిపాడు. దీంతో రేవతికి సంబంధించిన వీడియోను డిలీట్ చేశాడు వర్మ. తన కూతురు నుంచి రక్షించుకునేందుకు కాలేజ్ డేస్ లో తాను నేర్చుకున్న బ్రూస్ లీ స్టంట్స్ ను గుర్తు చేసుకుంటున్నానని అందుకు సంబంధించిన ఫోటోను సరదాగా పోస్ట్ చేశాడు వర్మ.