- Advertisement -
మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల సీఎండీలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విద్యుత్ సౌధ నుంచి గన్ పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన విద్యుత్ ఉద్యోగులు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. రేవంత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్.లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరికజారీ చేశారు. కరెంట్ ఉద్యోగులతో రేవంత్ పెట్టుకున్నారు మాడి మసవక తప్పదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి లోక్ సభ సభ్యత్వం రద్దు చేయ్యాలి…ఓటుకు నోటు దొంగను అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. బుడ్డరఖాన్ మాటలు మాట్లాడుతున్న రేవంత్ టీడీపీ హయాంలో ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోయారో చెప్పాలన్నారు.
- Advertisement -