వెనక్కి తగ్గిన రేవంత్..

19
- Advertisement -

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది రేవంత్ సర్కార్ పరిస్థితి చూస్తే. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టింది.సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారు. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుండి ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

దీంతో వెనక్కితగ్గిన రేవంత్ ప్రభుత్వం… ఒక్కరోజులోనే పెన్షన్ రికవరీలు ఆపండంటూ ఉత్తర్వులు జారీ జేసింది రేవంత్ సర్కార్.

Also Read:Donald Trump:ట్రంప్‌పై హత్యాయత్నం..

- Advertisement -