అదంతా తూచ్‌..!

190
- Advertisement -

తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు అబద్ధమని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘నేను ఏ పార్టీలో చేరడం లేదు. పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు విదేశాల నుంచి తిరిగొచ్చాక అన్ని విషయాలు వివరిస్తా’నని ఆయన తెలిపారు.

 Revanth Reddy turns up at TDP meet, remains defiant

అయితే.. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను కలిశారని, త్వరలోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆయన కూడా వాటిని ఖండించలేదు. పైగా తమ పార్టీకే చెందిన ఆంధ్రా మంత్రులపై విమర్శలు గుప్పించారు.

తర్వాత టీటీడీఎల్పీ సమావేశంలో పాల్గొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు రేవంత్‌. ఇప్పుడేమో పార్టీ మారడం లేదని చెబుతున్నారు. దీంతో విదేశాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు రేవంత్‌తో మాట్లాడారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా బాబు తిరిగొస్తేనే రేవంత్ వ్యవహరం ఓ కొలిక్కి వచ్చే వీలుంది.

- Advertisement -