కొడం’గల్’.. రేవంత్ ‘నిల్’!

67
- Advertisement -

అన్నీ ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటుంది.. ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే సామెత తరచూ వింటూనే ఉంటాం. నిండు కుండ తొణకదు అన్నట్లుగా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం అభివృద్ధి, సంక్షేమం సమపాళ్ళలో అందిస్తూ సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ చేసిన మేలును ప్రత్యేకంగా డంకు బజాయించి చెప్పాల్సిన అవసరం లేదు.. లభ్ది పొందిన ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు.. కానీ తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ తాటాకు చప్పుళ్ళు చేస్తున్న రేవంత్ రెడ్డి.. విషయంలో ఏ మాత్రం నమ్మకం లేదని స్వయంగా ప్రజలే బహిరంగంగా చెబుతున్నా పరిస్థితి. .

ఈ నేపథ్యంలో కామారెడ్డిలో కే‌సి‌ఆర్ కు పోటీనిచ్చుడు పక్కన పెడితే అసలు కొడంగల్ లో నైనా రేవంత్ రెడ్డికి గెలుపు ఖాయమేనా అంటే నో ఛాన్స్ అంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి విషయంలో నియోజకవర్గ ప్రజలు అత్యంత సానుకూలత కనబరుస్తున్నారు. ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజలకు పారదర్శికంగా చేరవేయడంలో నరేందర్ రెడ్డి పై ప్రజలు పొగడ్తలు కురిపిస్తున్నారు. అలాగే నిత్యం ప్రజల్లో ఉంటూ ఎలాంటి సమస్యలనైనా క్షణాల్లో పరిష్కరించేలా ప్రతి సామాన్యుడికి నరేందర్ రెడ్డి అందుబాటులో ఉండరని స్వయంగా నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:‘సమంత’ హాట్ ఫొటో పై రచ్చ

ఇక రేవంత్ రెడ్డి విషయానికొస్తే.. సామాన్యుడికి ఎప్పుడు అందుబాటులో ఉండరని, సమస్యలు చెప్పడానికి వచ్చిన వారిపై కూడా క్రూరంగా ప్రవర్తిస్తారని కోడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డి విషయంలో మండి పడుతున్నారు. ఆయన చేసే హామీలన్నీ తాటాకు చప్పుల్లే అని స్వయంగా కొండగల్ ప్రజలే విమర్శిస్తున్నారు. దీంతో ఈసారి కూడా కోడంగల్ లో రేవంత్ రెడ్డి కి ఘోర ఓటమి తప్పెలాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి రేవంత్ రెడ్డి కొడంగల్ మరియు కామారెడ్డి రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ కు అసలు పోటీనిచ్చే పరిస్థితే లేదు. అలాగే కొడంగల్ లో కూడా కూడా గెలుపు సంక్షిష్టమే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారుతుందనేది కొందరు రాజకీయవాదులు చెబుతున్న మాట.

- Advertisement -