తెలంగాణ పీసీసీ చీఫ్, మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు నానాతంటాలు పడుతున్నారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత రేవంత్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటీ ఉంటుందని, కాంగ్రెస్‌ది థర్డ్ ప్లేస్ అన్న సంకేతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో కాషాయనేతలు సక్సెస్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని మళ్లీ కిందిస్థాయి నుంచి బలోపేతం చేసి, వరుసగా ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా పార్టీకి మైలేజ్ తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కాగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని గట్టిగా నమ్ముతున్న రేవంత్ రెడ్డి సీఎం పదవిపై కన్నేసారు. ఈక్రమంలో ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగడం ఖాయమైంది. కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో తన కంచుకోట అయిన కొడంగల్‌లో రేవంత్ రెడ్డి అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి విజయం సాధించి పరువు నిలబెట్టుకుంటున్నారు. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంపీకి బదులుగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారంట…అయితే తన కంచుకోట కొడంగల్‌లో పోటీ చేసేందుకు రేవంత్ ఇష్టపడడం లేదంట.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి ఆయన కళ్ల ముందు కదలాడుతుందంట..అంతే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలంటే హైదరాబాద్‌లోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రేవంత్ భావిస్తున్నాడంట..అదీ తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నాడంట.. మరీ ముఖ్యంగా తనకు తొడగొట్టి మరీ సవాల్ విసిరిన మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రేవంత్ దాదాపుగా ఫిక్స్ అయ్యాడంట.
రేవంత్‌కు, మల్లారెడ్డికి టీడీపీలో ఉన్నప్పటి నుంచి విబేధాలు ఉన్నాయి. గతంలోనే మల్కాజ్గిరి నుంచి పోటీకి రేవంత్ సై అన్నా…చంద్రబాబు మల్లారెడ్డివైపే మొగ్గు చూపారు. పాత లెక్కలు సరి చేసేందుకు మేడ్చల్ నుంచి పోటీ చేసి మల్లారెడ్డిని ఓడించాలని రేవంత్ ఫిక్స్ అయ్యాడంట..మేడ్చల్ కుదరకపోతే…తనకు సవాల్ విసిరిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీనగర్ నుంచి పోటీ చేసేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారట…అయితే మేడ్చల్ అయితే సెంటిమెంట్ ప్రకారం బాగుంటుందని, తనకు తొడగొట్టి సవాల్ విసిరిన మంత్రి మల్లారెడ్డికి చెక్ పెట్టినట్లు అవుతుందని రేవంత్ డిసైడ్ అయ్యాడంట.. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మల్లారెడ్డిని తక్కువ అంచనా వేస్తే రేవంత్‌కు దెబ్బడిపోవడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే…పోల్ మేనేజ్మెంట్ చేసి ఎన్నికల్లో గెలవడంలో మల్లారెడ్డి దిట్ట..రేవంత్ మల్లారెడ్డిని తక్కువగా అంచనా వేసి పోటీ చేస్తే బోర్లా పడే అవకాశాలు ఉన్నాయి..మొత్తంగా మేడ్చల్ నుంచి బరిలోకి దిగితే రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డిల మధ్య రసవత్తరమైన పోరు జరగడం ఖాయమని రాజకీయవర్గాలు అంటున్నాయి.