Revanth:మోడీ వస్తే రిజర్వేషన్లు రద్దు

10
- Advertisement -

మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.వంద సంవత్సరాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆర్ఎస్ఎస్ కంకణం కట్టుకుందని, తమకు మెజార్టీ వస్తే రిజర్వేషన్లు తీసేయడం సులభం అని మోదీ అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఎన్డీయే పదేళ్ల పాలనపై గాంధీ భవన్ లో నిర్వహించిన ఛార్జ్ షీట్ విడుదల కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్..మోదీ దేశాన్ని మోసం చేశాడు. డబుల్ ఇంజిన్ అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాదు.. అదానీ, ప్రధాని అంటూ రేవంత్ విమర్శించారు.

పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు అన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారని కేంద్ర ప్రభుత్వం తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వేసే ప్రతీఓటు రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుందన్నారు.

పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని సీఎం రేవంత్ విమర్శించారు. 20కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. నల్లధనం తెస్తానన్న మోదీ పది పైసలు కూడా తేలేదు అన్నారు.

Also Read:రాత్రి పూట ఈ కూరగాయలు తింటే..!

- Advertisement -