రేవంత్‌..ఆంధ్రా పిల్లి!

2
- Advertisement -

రాష్ట్రంలో పంటలను ఎండ పెట్టే ప్రభుత్వం నడుస్తుంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదన్ చారి, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇది ఆరోపణ కాదు.. నిజం..నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. కృష్ణా జలాల విషయంలో ఆంధ్ర నాయకుల ఎదుట పిల్లిలా వ్యవహరిస్తున్నారు..పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆ ప్రాంతాన్ని ఎండ పెడుతున్నారు..కల్వకుర్తి పోతల పథకంలో భాగంగా ఎల్లూరు పంపు హౌస్ లో రెండే మోటర్లు నడుస్తున్నాయి అన్నారు.

5 మోటర్లు.. 24 గంటలు నడపాలి..కేవలం 7 వందల క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎత్తిపోస్తున్నారు..రోజుకు 4000 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయొచ్చు..కేవలం చంద్రబాబు కోసమే ఇలా చేస్తున్నారు..భీమా ప్రాజెక్టు లో 3 మోటార్లు ఉంటే 1 మోటర్ నడుపుతున్నారు..నెట్టెంపాడులో 4 ఉంటే 1 నడుపుతున్నారు..కోయిల్ సాగర్ 3 ఉంటే 1 మోటర్ నడుపుతున్నారు..ఇలాంటి పరిస్థితి మా హాయంలో ఎప్పుడు లేదు..అసంబ్లీ లో మమ్ముల్ని ఎత్తడం కాదు.. కృష్ణ జలాలు ఎత్తాలి..రేవంత్ వ్యవహారంతో ఆంధ్రా కు మేలు జరుగుతుంది..రేవంత్ తీరుతో కృష్ణ పరివాహక ప్రాంత జిల్లాలు ఎoడుతున్నాయి..రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో, సొంత ఊరిలో నీటి కోసం అర్ధనగ్నంగా నిరసనలు చేశారూ..మేము అసెంబ్లీ బయట అర్ధనగ్న ప్రదర్శన చేస్తే అడ్డుకున్నారు.. మరి మీ ఇలాకాలో జరిగిన నిరసనపై ఏమంటారు..అన్ని ప్రాంతాల్లో ఇలాగే కరెంట్, నీళ్ల కోసం ధర్నాలు చేస్తున్నారు..దదమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..గతంలో కేసీఆర్ కృషి తో మిగులు కరెంటు ఉంది..కేటీపీఎస్, బిటిపిఎస్, యాదాద్రి కరెంట్ ఉత్పత్తి కేంద్రాలలో ఉత్పత్తి నిలిపేశారు..కొత్తగా కాంగ్రెసు పార్టీ చేసింది ఏమి లేదు.. కట్టిన ఇల్లు..పెట్టిన పొయ్యి.. లాగా ఇచ్చిన రాష్ట్రాన్ని నడపడం చేతకావడం లేదు..మీ కాలంలో ఒక్క సబ్ స్టేషన్ నిర్మాణం చేయలేదు అన్నారు.

కరెంట్ సరఫరాపై గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నానా యాగి చేశారు..ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వెంకట్ రెడ్డి..3 ఏళ్ల నుంచి పాలమూరు ప్యాకేజ్ 3 పూర్తి చేయలేదు..కేసీఆర్ కు పేరు వస్తుందని చేయడం లేదా.. రేవంత్ రెడ్డి..అనధికారికంగా ఆంధ్రా ప్రభుత్వం చాలా నీళ్లు తరలించింది.. ఆ లెక్కలు తేలాలి..మోటర్లు ఆపడం.. నడపడం వల్ల అవి దెబ్బతింటాయి అని అధికారులు చెబుతున్నా పట్టించుకోవడం లేదు..మోటర్లు కాలిపోతాయి.. ఇది బాధ్యతరాహిత్యం..ప్రభుత్వానికి ఏమి పట్టింపు లేదు..ముఖ్యమంత్రి, నీటి సరఫరా శాఖ మంత్రి వారి జిల్లాలకు ద్రోహం చేస్తున్నారు..మా హయాంలో ఎత్తిన నీటికి.. కాంగ్రెస్ ఎత్తిపోసిన నీటికి చాలా వ్యత్యాసం ఉంది..ఈ 3 సంవత్సరాల కాలంలో కృష్ణా జలాలు తక్కువ వాడారు..మా హయాంలో కృష్ణ ట్రిబ్యునల్ కు వెళ్లి మా హక్కులు సాధించి చూపాం..ఇవి అధికార లెక్కలు..ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు..ఆంధ్ర ప్రదేశ్ తరలించుకుపోయే నీటిపై అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేస్తున్నం..అన్ని ప్రాజెక్టుల పరిధిలో నీటిని ఎత్తిపోయాలి..18 గంటల పని చేసే రేవంత్ రెడ్డి.. నీ పనితనం ఇదేనా..మీరు వస్తే పాత రోజులు వస్తాయని అన్నారు.. అన్నట్లే చేసి చూపించారు..డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతున్నారు..దానితో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అన్నారు.

Also Read:రిలేషన్‌ షిప్‌లో..ఈ చిన్న పొరపాట్లే!

- Advertisement -