KTR: రేవంత్ రెడ్డి ‘చీప్ మినిస్టర్’

11
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ కోసం రేపు బీఆర్ఎస్ చేసే ధర్నాలు తొలి అడుగు మాత్రమేనని కాంగ్రెస్ నేతలను వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. రూ.2 లక్షల రుణమాఫీ హామీ చేస్తామని బూటకపు హామీ ఇచ్చారన్నారు.

రుణమాఫీ పేరుతో రైతులకు కుచ్చు టోపీ పెట్టారన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ నేతలు చెప్పేవన్ని ఉత్తర కుమార ప్రగల్బాలే అన్నారు. ఏ పత్రిక, ఛానల్ చూసినా ఇవే వార్తలు కనిపిస్తున్నాయన్నారు. ఆందోళన చేస్తున్న రైతులపై ఏడేళ్లు, రెండేళ్లు శిక్షలు పడే కేసులు పెడుతూ… మరోవైపు అందరికి రుణమాఫీ అయిందని సీఎం సంబరాలు చేసుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు.

రుణమాఫీ విషయంలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ.. రేపు అన్ని మండల కేంద్రాల్లో రైతుల ధర్నాలు ఉంటాయి. రేపటి ఆందోళనలు మొదటి అడుగు మాత్రమే. రైతులపై కేసులు ఉపసంహరించుకోవాలి. రుణమాఫీ చేయనందుకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు చేస్తామని కేటీఆర్‌ వెల్లడించారు.

Also Read:ఇమ్యూనిటీ పెంచుకోండిలా!

- Advertisement -