అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్: కేటీఆర్

4
- Advertisement -

మొన్న తలుపులు ఎత్తుకుపోయిండు.. నిన్న స్టార్టర్లు ఎత్తుకుపోయిండు.. ఇక రేపు మీ పుస్తెలతాడు కూడా రేవంత్ రెడ్డి ఎత్తుకుపోతడు అని రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే పని కల్వకుర్తి ప్రాంతం నుంచే మొదలుపెట్టాలి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం, ఆమనగల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్.

420 దొంగ హామీలు ఇచ్చి నంగనాచి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు.. కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఎవరికి న్యాయం చేయలేదు. అక్కడ ఎవరికి రైతుబంధు రాలేదు. రుణమాఫీ కాలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వలేదు. ఆడబిడ్డలకు 2,500 రూపాయలు కూడా ఇవ్వలేదు అన్నారు. సొంత నియోజకవర్గంలో ఒక్క పని చేయలేదు. పుట్టి పెరిగిన పిల్లనిచ్చిన కల్వకుర్తి ప్రాంతానికి కూడా ఒక్క రూపాయి పని చేయలేదు అన్నారు.

రేవంత్ రెడ్డిది సిగ్గు ,లజ్జ లేని బతుకు కాబట్టే తెలంగాణ ప్రజలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నా కూడా పట్టించుకోకుండా ఉంటున్నడు.. 42% రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు అన్నారు. రైతు భరోసా 15,000 ఇస్తానని అన్నదాతలను మోసం చేసిండు… 12,000 ఇస్తానని రైతు కూలీలను మోసం చేసిండు అన్నారు.

కాంగ్రెస్ 420 పాలనలో 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గురుకుల పాఠశాలలను నడపడం చేతకాని సన్నాసి రేవంత్ రెడ్డి అన్నారు.ఇప్పటికి 56 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం విషాదకరం.. కాంగ్రెస్ దరిద్రపు పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు అన్నారు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి ఫికర్ లేదు.. 600 కోట్ల రూపాయలు ఇస్తే సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

Also Read:బెంగళూరులో నీటి కటకట!

- Advertisement -