తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ రాధాకృష్ణన్‌ను స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఉన్నారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌తోపాటు ట్యాంక్‌బండ్‌పై ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. రెండు పూటలా దశాబ్ది వేడుకలు నిర్వహించనుండగా జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్ పార్క్ లో అమర వీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు.
జూన్ 2న సాయంత్రం ట్యాంక్ బండ్‌పై తెలంగాణ దశాబ్ది వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్‌కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ ఫుల్ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు.
Also Read:గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..బ్లాక్ బస్టర్ హిట్