టీపీసీసీ చీఫ్ రెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తనకు టీడీపీ పుట్టినిల్లని.. కాంగ్రెస్ అత్తారిల్లని అర్థం వచ్చేలా ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. గతంలో ఆయన టీడీపీలో ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీలో ఉన్నప్పుడు ఆయన ఓటుకు నోటు కేసులో జైలు శిక్ష కూడా అనుభవించిన సంగతి విధితమే. అయితే ఆ తరువాత ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హస్తం పార్టీలో చేరినప్పటి నుంచి టీడీపీ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు కూడా పెద్దగా స్పందించలేదు రేవంత్ రెడ్డి. ఇదే విషయంలో ఓ యాంకర్ ఇటీవల ఆయనను ప్రశ్నించగా.. ” నేను టీడీపీ నుంచి బయటకు వచ్చాను. .
కూతురు పుట్టింట్లో తల్లిదండ్రుల పక్షాన ఉంటుంది. అత్తగారింటికి వెళ్ళాక ఆ ఇంటి గౌరవాన్ని కాపాడుతుంది. కాంగ్రెస్ లో కొడలిగా నా పాత్ర పోషించాలి. పుట్టింటి గొప్పలు చెప్పలేను అంటూ ” సమాధానం ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు పెల్లుబికుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ స్పందిస్తూ వ్యగ్యస్త్రాలు సందించింది. కాంగ్రెస్ తో పెళ్లి చేసుకున్నందుకు పుట్టింటి వాళ్ళు ఎన్ని వేల కోట్ల కట్నం ఇచ్చారు ? ఆ కట్నంతోనే పీసీసీ పదవి కొన్నారా ? అత్తారింట్లో గొడవ వస్తే పుట్టింటికి వెళ్లిపోతారా ? టీడీపీ లో చేరతారా ? వీటిపై స్పష్టత నిస్తే నిన్నెక్కడ ఉంచాలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుంది కదా ? అంటూ ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పై వైసీపీ చేసిన ఈ విమర్శలు రాజకీయ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
.@revanth_anumula ఇంతకూ కాంగ్రెస్ తో పెళ్ళి చేసినందుకు మీ పుట్టింటి @JaiTDP వాళ్ళు ఎన్ని వేలకోట్లు కట్నం ఇచ్చారు. ఆ కట్నంతోనే పీసీసీ పదవి కొన్నావా? భవిష్యత్తులో అత్తగారింట్లో గొడవ వస్తే మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతావా? పుట్టింటి గౌరవం కాపాడే తాపత్రయంతో మళ్ళీ టీడీపీలో చేరిపోతావా?… pic.twitter.com/KYgBIB50pv
— YSR Congress Party (@YSRCParty) November 13, 2023