Motkupalli:రేవంత్ రెడ్డి..పొట్టి దొర

12
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు. రేవంత్ చాతకాని వెధవ అని..పొట్టి దొర అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అరేయ్ పొట్టి దొర.. నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా..? అంటూ ఫైర్ అయ్యారు.

నువ్వు నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వవా..? దుర్మార్గుడా.. నువ్వు మొగోనివా..? కులాల ప్రతిపాదికన సీట్ల విషయం ఒకసారి మాట్లాడుతా అంటే నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడు ఆ మొనగాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 లక్షలున్న నా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వకుండా, పట్టుమని 10 మంది ఉన్న వేరే కులాలకు టికెట్ ఇస్తావా అని ప్రశ్నించారు.

పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తడు. కానీ చేసేది మాత్రం శూన్యం. రేవంత్ రెడ్డి చాతకాని వెధవ అని దుయ్యబట్టారు. నువ్వు ఎన్ని రోజులు ఉంటవ్ సీఎంగా.. నా మాదిగ బిడ్డలు నీకు కర్రుకాల్చి వాత పెడుతారు.. గుర్తుంచుకో అని హెచ్చరించారు.

- Advertisement -