రేవంత్-కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు

7
- Advertisement -

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. బక్రీద్ త్యాగానికి ప్రతీక అని… అచంచలమైన భక్తిని, త్యాగాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.

త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. దైవాజ్ఞను అనుసరించి సమాజ హితం కోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. తమకు కలిగిన దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని అన్నారు.

Also Read:Kalki:అతిథిగా సీఎం, డిప్యూటీ సీఎం!

- Advertisement -