కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన చిత్రం రెట్రో. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మే 1న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద బొళ్తా పడింది. మలయాళ నటుడు జోజు జార్జ్, కరుణకరణ్, జయరామ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
తమిళ్ లో మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడిన ఈ సినిమా రీసెంట్ గానే ఓటిటిలో కూడా వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని అందుకుంది.
కేవలం ఒక్క వారంలోనే ఈ సినిమా 4.2 మిలియన్ వ్యూస్ ని నెట్ ఫ్లిక్స్ లో అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా 2డి సినిమాస్ వారు అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.
Also Read:TG:ఐపీఎస్ అధికారుల బదిలీ

