కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రెట్రో. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 01న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మలయాళ నటుడు జోజు జార్జ్, కరుణకరణ్, జయరామ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను పెంచాయి.
అయితే, ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డే ఫస్ట్ షో వివరాలను చిత్ర యూనిట్ తాజాగా రివీల్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డే ఫస్ట్ షో మే 1న ఉదయం 9 గంటలకు ఇండియా వ్యాప్తంగా ప్రదర్శించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు కేరళలోని ఫస్ట్ డే ఫస్ట్ షో పై క్లారిటీ ఇస్తూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Also Read:వక్ఫ్ బిల్లుకు లోక్ సభ అమోదం