- Advertisement -
అగస్టా వెస్ట్‌ల్యాండ్ చాపర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగిని సీబీఐ అరెస్ట్ చేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో త్యాగికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్టు ఆరోపణలు ఉన్నాయి. త్యాగి సోదరుడు జూలీని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో ప్రమేయమున్న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ ఖైతాన్ సహా మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.ఈ కేసులో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -