నేటి నుంచి మూడు నెలలపాటు నల్లమల అడవిలో ఆంక్షలు విధించారు అధికారులు. నేటి నుంచి సెప్టెంబర్ 30 వరకు సఫారీ టూర్ బంద్ కానుంది.పెద్ద పులులు వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయానికి మూడు నెలలు ఉండనుంది. అడవిలోకి వాహనాలతో పాటు మనుషులు కూడా వెళ్లొద్దని ఆంక్షలు విధించారు.
జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 31వ తేదీ వరకు (మూడు నెలలు) వన్యప్రాణులు ప్రధానంగా పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులు సంతానోత్పత్తికి జతకూడే సమయం కావడంతో 90 రోజుల పాటు సఫారీ టూరిజం ప్యాకేజీని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామన్నారు.
సంతానోత్పత్తి సమయంలో పులులకు అలజడి ఉండకూడదనే ఉద్దేశంతో రిజర్వు అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ (ఎన్‌టీసీఎ ) ఆదేశించిందన్నారు. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 2,61,139 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమ్రాబాద్ రిజర్వు టైగర్ (ఏటీఆర్)విస్తరించి నల్లమల భారత దేశంలోనే రెండో అతి పెద్ద రిజ ర్వు టైగర్ ప్రాంతంగా పేరు గాంచింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రత్యేక నిధులు కేటాయించి అడవులు, వన్యప్రాణుల సంరక్షణ చేపడుతున్నారు. నల్లమల అటవీ అందాలతోపాటు వన్యప్రాణులు, క్రూర మృగాల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశాలను దేశంతోపాటు విదేశీ ప్రకృతి, ప ర్యాటక ప్రేమికులు సై తం టూరిజం ప్యాకేజీతో నల్లమలలో పర్యటించేందుకు అటవీశాఖ అధికారులు రెండేండ్లుగా పర్యాటక యాత్రకు చర్యలు తీసుకున్నారు.
Also Read:పాశమైలారం ఘటనపై హరీష్ రావు

