భారత జట్టు న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన జట్టును బీసీసీఐ జనవరి 3 లేదా 4 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు మూడు వన్డేలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో, బుమ్రా, హార్దిక్‌లను పూర్తిగా ఫిట్‌గా ఉంచాలని సెలెక్టర్లు నిర్ణయించారు. అందుకే వన్డే సిరీస్‌కు వీరిని పక్కన పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేదు. ఫిట్‌నెస్ సమస్యలే ఇందుకు కారణం. మరోవైపు బుమ్రా 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇంకా ఆడలేదు. అతని వర్క్‌లోడ్‌ను బీసీసీఐ చాలా జాగ్రత్తగా నియంత్రిస్తోంది. టీ20 ప్రపంచకప్ అనంతరం అతను వన్డే ఫార్మాట్‌లో ఎక్కువగా కనిపించే అవకాశముందని సమాచారం.
ఇదిలా ఉండగా, బీసీసీఐ ఆదేశాల ప్రకారం ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో తప్పనిసరిగా పాల్గొనాలన్న నిబంధన మేరకు హార్దిక్ పాండ్యా విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరఫున ఆడే అవకాశం ఉంది. క్రిక్‌బజ్ కథనం ప్రకారం, జనవరి 3, 6, 8 తేదీల్లో రాజ్‌కోట్‌లో జరిగే చివరి మూడు లీగ్ మ్యాచ్‌లలో రెండింటికి అతను అందుబాటులో ఉండవచ్చు.
భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు తన ఫిట్‌నెస్‌ను పరీక్షించుకునేందుకు జనవరి 3న మహారాష్ట్రతో జరిగే మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడే అవకాశం ఉంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌లో జరిగిన స్ప్లీన్ గాయంతో అతను కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు.
Also Read:పెళ్లి తేదీ ప్రకటించిన అల్లు శిరీష్
ఇతర ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే కూడా త్వరలో ముంబై జట్టుతో చేరి దేశవాళీ టోర్నమెంట్‌లో ఆడే అవకాశముందని తెలుస్తోంది.

