త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు ఇస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వనమహోత్సవంలో మాట్లాడిన రేవంత్… వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. ఇంటిని అద్భుతంగా నడిపే ఆడబిడ్డలు.. రాజ్యాన్ని కూడా నడుపుతారనే నమ్మకముంది అన్నారు.
ఆడబిడ్డలకు రాజ్యం నడిపే శక్తి ఉంది… రాబోయే ఎన్నికల్లో 60 మంది మహిళలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు ముఖ్యమంత్రిగా నేనేం భోజనం చేస్తున్నానో
రేషన్ షాపుల్లో కూడా అదేవిధంగా సన్నబియ్యం ఇస్తున్నాం అన్నారు. 15 ఏళ్లు నిండితే మహిళా సంఘంలో సభ్యులు కావొచ్చు అన్నారు రేవంత్.
గతంలో 18 – 60 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లే మహిళా సంఘంలో సభ్యులుగా ఉండేది… మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇప్పటికే రూ. 21 వేల కోట్లు మహిళా సంఘాలకు ఇచ్చాం అన్నారు. హైటెక్ సిటీ అంటే విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్..అంతేనా?, హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ గురించి మాత్రమే పత్రికల్లో రాస్తున్నారు అన్నారు.
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మూడున్నర ఎకరాల్లో ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయం గురించి రాయడం లేదు అన్నారు. పిల్లల అటెండెన్స్ పంతులు తీసుకుంటే … పంతులు స్కూలుకు వస్తున్నడా లేదా అనే బాధ్యత మహిళలకు ఇచ్చాం అని చెప్పారు.
Also Read:సోషల్ మీడియా పోస్టులు..అత్యుత్సాహం వద్దు!

