గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

582
IPR_
- Advertisement -

నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో జనవరి 26న జరిగే గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఇవాళ బి.ఆర్.కె.ఆర్ భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జనవరి 26న ఉదయం పబ్లిక్ గార్డెన్స్ లో గణతంత్రదినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయన్నారు.

ఈ వేడుకలకు అవసరమైన పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు, బారికేడింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈసమావేశంలో జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధర్ సిన్హా, డిజిపి మహేందర్ రెడడ్ఇ, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ తదితర శాఖల అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -