తెలంగాణ ప్రభుత్వ నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనంను ఇవాళ సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
సచివాలయ ప్రాంగణం పరిసరాల్లో ఇవాళ ఉదయం 4 నుంచి రాత్రి 8గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు ప్రకటించారు. ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్ ఎన్టీఆర్ ఘాట్ నెక్లెస్ రోడు లుంబినీ పార్కులు మూసివేయనున్నట్టు అదనపు సీపీ వెల్లడించారు.
పీవీ విగ్రహాం నెక్లెస్ రోటరీ ఎన్టీఆర్ మార్గ్ తెలుగు తల్లి జంక్షన్ వరకు ఇరువైపుల అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. అలాగే సచివాలయ ఆహ్వానితుల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించామని మరియు సచివాలయానికి వచ్చే ఆహ్వానితులు తమ పాస్‌లను కార్ డోర్లకు అతికించుకోవాలని సూచించారు.
Also Read: బ్రిజ్‌భూషణ్‌పై చర్యలేవి…రెజర్ల దీక్షలో ప్రియాంక
ట్రాఫిక్ దారి మళ్లింపు
- ఆఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్‌కు ట్యాంక్‌బండ్‌పై నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి కట్టమైసమ్మ ఆలయం లోయర్ ట్యాంక్‌బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ వైపునకు వెళ్లాలి.
- ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ వైపు నుంచి నెక్లెస్ రోటరీవైపు అనుమతి లేదు. ఈ వాహనాలను వీవీ విగ్రహం చౌరస్తా నుంచి సాదన్ కాలేజీ, నిరాంకరి వైపు మళ్లిస్తారు.
- నిరాంకరి చింతలబస్తీ వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలకు ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లేందుకు వీలు ఉండదు.
- లిబర్టీ వైపు నుంచి తెలుగు తల్లి, అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్ వైపు అనుమతి లేదు. ఈ వాహనాలు నేరుగా ఫ్లై ఓవర్ మీదకు వెళ్లి అక్కడి నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ వెళ్లాలి.
- ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఎన్టీఆర్‌మార్గ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ జంక్షన్‌వైపు మళ్లిస్తారు.
- బీఆర్‌కే భవన్ వైపు నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌కు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
- బడా గణేశ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను బడా గణేశ్ నుంచి రాజ్‌దూత్ లైన్‌కు మళ్లిస్తారు.
Also Read: తెలంగాణలో విస్తారంగ వానలు… ఆరెంజ్ అలర్ట్ జారీ