ఆగస్టు7వ జాతీయ చేనేత దినోత్సవంగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. చేనేతకు ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ఏర్పాటుచేసిన ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు సినీ నటి,దర్శకురాలు రేణూ దేశాయ్. ఈ సందర్భంగా ర్యాంప్ వాక్ చేసి అందరిని అలరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేణు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల చేనేతకు మరింత ఆదరణ పెరుగుతుందన్నారు. చేనేతను అందరు ఆదరించాలన్నారు. డైలీ వేర్‌గా చేనేత దుస్తులను వాడవచ్చని… చేనేత దుస్తులను తాను ఎక్కువగా కట్టుకుంటానని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాల్లో ఇండియాకు ప్రత్యేకత ఉందని.. ప్రతి ప్రాంతానికో సంప్రదాయం ఉందన్నారు.
సినిమా రంగంలో చేనేత దుస్తుల ఆదరించాలని..అలా చేస్తే ఫ్యాషన్‌గా మారి మరింత ఆదరణ లభించే అవకాశం ఉందన్నారు. చేనేత వస్త్రాలపై కొందరికి చిన్నచూపు ఉందని…. అలాంటి వారు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలన్నారు. కేవలం మహిళలే కాకుండా అబ్బాయిలకు కూడా చేనేత షర్టులు, టీషర్టులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా హ్యాండ్ లూమ్ కలెక్షన్స్‌తో పలువురు మోడల్స్ మతి పొగొట్టగా…. చేనేత రంగంలో సేవలు అందిస్తున్న మహిళలకు సత్కారం చేశారు.