మళ్ళీ పెళ్ళిచేసుకుంటా: పవన్ మాజీ భార్య

221
Renu Desai Opens up on her Second Marriage
- Advertisement -

హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ మనసు మార్చుకుంది. జీవిత భాగస్వామి లేకుండా అంటే ఒంటరిగా జీవించడం చాలా కష్టమని, అయినప్పటికీ.. ముందుకు సాగాల్సిందేనని అంటోంది రేణూ. అయితే తాజాగా ఆమె బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగాన్ని ఆమె ఓ చానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్చూ ఇచ్చారు.

Renu Desai Opens up on her Second Marriage
ఇందులో రేణూ దేశాయ్ మాట్లాడుతూ..‘‘ఏడాది క్రితం వరకు నాకు పెళ్లి ఆలోచనే లేదు. కానీ, ఆరోగ్యం బాగాలేనప్పుడు నాకంటూ ఎవరైనా ఉంటే కొంచెం హెల్ప్ అవుతుందనిపించింది. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడం కానీ, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి మన అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుంది. నాకు ఒంట్లో బాగలేకపోతే రెండుమూడు సార్లు మా అక్కవచ్చి ఉదయం 3 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆ సమయంలో అనిపించింది. నా అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుందని. ఆ ఇన్సిడెంట్‌కు ముందు నో మ్యారేజ్.. నో లవ్.. నో రిలేషన్ షిప్.. నోమోర్ అనుకున్నా. కానీ ఒంట్లో బాగాలేనప్పటి నుంచి ఆలోచన మారుతోంది. చూద్దాం ఏదైనా రాసుంటే.. ఎందుకంటే మనకు తెలీదు కదా.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ప్రస్తుతానికి ఎవరూ లేరు. దేవుడు ఎవరినైనా పంపిస్తే చూద్దాం.’’ అంటూ తన మనసులోని బాధను, భావాన్ని వ్యక్తం చేశారు రేణూ దేశాయ్.

- Advertisement -