కాశ్మీర్‌లో ఎంజాయ్ చేస్తున్న రేణు..!

267
Renu Desai in Kashmir
- Advertisement -

కాశ్మీర్ ఈ పేరు వినగానే..పొగ మంచు.. పర్వతాలు.. అందమైన అక్కడి వాతావరణం గుర్తోస్తాయి. అయితే సినీ పరిశ్రమలో చాలా మంది నటి నటులు ఏడాదిలో ఓ సారైన కాశ్మీర్‌కు వెళ్లి రిలాక్స్‌ అవుతుంటారు. రీసెంట్ గా మెగా దంపతులు అక్కడికి వెళ్లి వచ్చారు. ఇప్పుడు అదే తరహాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా కాశ్మీర్ లో విహార యాత్రలను చేస్తున్నారు. గత కొంత కాలంగా ఆమె ఓ రియాలిటీ షోతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా కొంచెం గ్యాప్ దొరకడంతో రేణు కాశ్మీర్ ట్రిప్ వేశారు.

Renu Desai in Kashmir

అక్కడ ఉన్న మంచు ప్రాంతాలను చుట్టేస్తూ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. గత వరం రోజులుగా అక్కడి మంచు కురుస్తున్న ప్రదేశాల్లో పోటోలను దిగుతూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటోంది. అక్కడ లోకల్ మహిళలతో గడుపుతూ.. టీ తాగుతూ.. మంచులో సేద తీరుతూ.. రేణు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలలో చాలా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -