తెల్ల వెంట్రుక పీకితే..మరిన్నిపెరుగుతాయా?

36
- Advertisement -

నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలమందికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. సాధారణంగా వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య నేటి రోజుల్లో పిల్లల్లోనూ కనిపిస్తోంది. తెల్ల జుట్టు రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొందరికి జన్యుపరమైన లోపాల కారణంగా తెల్ల జుట్టు ఏర్పడుతుంది. మరికొందరికి ఆహారపు అలవాట్లు, దుమ్ము, కాలుష్యం, జుట్టుకు పోషణ లేకపోవడం, విటమిన్ల లోపం వంటి కారణాల వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుంటుంది. తెల్ల జుట్టు రావడంతో ఎంతో మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతూ. తెల్లజుట్టును నల్లగా మార్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొందరు తెల్ల వెంట్రుకలను పికెసేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. .

అయితే తెల్ల వెంట్రుకలు పీకడం వల్ల మరిన్ని తెల్ల వెంట్రుకలు పెరుగుతాయని చాలమంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే పెద్దలు ఈ విషయాన్ని తరచూ చెబుతుండడం వల్ల నెరసిన వెంట్రుకలను పికెందుకు చాలమంది భయపడిపోతుంటారు. అయితే తెల్ల వెంట్రుక పీకితే మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయనేది కేవలం ఒట్టి అపోహ మాత్రమే అని చెబుతున్నారు బ్యూటీషియన్స్. తెల్ల వెంట్రుక పీకితే దాని స్థానంలో మరో తెల్ల వెంట్రుక వస్తుంది.. అంతే కానీ అది మరిన్ని తెల్ల వెంట్రుకలు రావడానికి ఏ మాత్రం కారణం కాదని చెబుతున్నారు.

కాబట్టి అలాంటి మాటలను కేవలం అపోహగా మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు బ్యూటీషియన్స్. తెల్ల వెంట్రుకలు రావడానికి ప్రధాన కారణం మొలోనోసైట్స్ ఉత్పత్తి చేసే మెలనిన్ తగ్గినప్పుడు తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఇలా తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఆహార విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్న మాట. ముఖ్యంగా విటమిన్ సి, ఇ, బి12, ఫోలిక్ యాసిడ్, జింక్, కాపర్,.. వంటి పోషకాలు ఉండే ఆహార పదార్థాలు అనగా.. పెరుగు, టమాటో, క్యాలీఫ్లవర్, అరటిపండు, కివీ, ఉసిరి, దానిమ్మ, చిరుదన్యాలు.. వంటి వాటిని డైలీ ఆహార డైట్ లో చేర్చుకుంటే జుట్టుకు తగిన పోషణ అంది తెల్ల జుట్టు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు బ్యూటీషియన్స్.

Also Read:షర్మిలపై ఫిర్యాదు..ఇద్దరికి షోకాజ్ నోటీస్

- Advertisement -