పెదవులు పగిలితే.. ఇలా చేయండి!

50
- Advertisement -

చలికాలంలో సర్వసాధారణంగా కనిపించే సమస్య పెదవులు పగలడం. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా శరీరంలో తేమ శాతం తగ్గిపోతు ఉంటుంది. తద్వారా చర్మం పొడిబారడం, పెదవులు పగలడం వంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతు ఉంటాయి. ముఖ్యంగా పెదాలు పగలడం వల్ల ఆహారం తినడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు కొందరు. ఇంకా రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల పలు మార్కెట్ లో దొరికే వ్యాజిలిన్ ఇంకా పలు రకాల మెడిసిన్స్ వాడుతుంటారు. అయితే కొన్ని పెదవులు పగలడాన్ని కొన్ని చిట్కాలు పాటించి నివారించవచ్చు అవేంటో చూద్దాం.

పెదాల పగుళ్లను నివారించడంలో కలబంద సమర్థవంతంగా పని చేస్తుంది. కలబందలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ తేమ శాతాన్ని పెంచడంలో ఉపయోగ పడతాయి. కలబంద గుజ్జు ను పగిలిన పెదవులపై పూసి.. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే ఆ సమస్య తగ్గుతుంది. ఈ సమస్యకు తేనె కూడా అద్భుతంగా పని చేస్తుంది. తేనెను పెదవులపై రాసి సున్నితంగా మర్దన చేస్తే పగుళ్లు తగ్గిపోతాయి.

ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మంచి మెడిసిన్ లా పని చేస్తాయి. ఇంకా జున్ను, చీజ్ వంటివి కూడా పెదాల పగుళ్లను నివారిస్తాయి. కాబట్టి ఈ చిన్న చిట్కాలు పాటించి చలికాలం వేధించే ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అయితే వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. చలిలో ఎక్కువ సేపు బయట ఉండకూడదు. శరీరంలో తేమ శాతం తగ్గకుండా నీరు త్రాగడం, మినరల్స్ ఉన్న కొబ్బరి నీరు, ఫ్రూట్ జ్యూస్ వంటివి తాగుతూ ఉండాలి. తద్వారా చర్మం పొడిబారకుండా ఉంటుంది.

Also Read:45 కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు

- Advertisement -