- Advertisement -
నటుడు అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. రూ. 50 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరి సాక్ష్యాలను సమర్పించాలని వెల్లడించింది న్యాయస్థానం.
పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో ఆయన విడుదలయ్యారు.
Also Read:2024: శ్రీవారిని దర్శించుకున్న 2.55 కోట్ల మంది భక్తులు
- Advertisement -