వైఎస్‌ జగన్‌కు హైకోర్టులో ఊరట..

3
- Advertisement -

ఏపీ మాజీ సీఎం జగన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ చేయాలని హైకోర్టులో జగన్‌ పిటిషన్‌ వేయగా ఐదేళ్ల పాటు పాస్‌పోర్ట్‌ను రెన్యువల్‌ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పాస్ పోర్టు విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన రెన్యువల్ ను ఐదేళ్లకు పెంచూతూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా సీఎంగా ఉన్న సమయంలో జగన్‌కు డిప్లొమాట్ పాస్ పోర్టు ఉండేది. ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ పాస్ పోర్టు రద్దు అయింది.

జనరల్ పాస్ పోర్టు కోసం జగన్ దరఖాస్తు చేశారు. అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసుపై ఎన్‌వోసీ తీసుకోవాలని జగన్‌కు ఇటీవల పాస్ పోర్ట్ కార్యాలయం లేఖ రాసింది. దీంతో ఎన్వోసీ ఇవ్వాలంటూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఒక సంవత్సరం పాటు పాస్ పోర్టు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు జగన్. అక్కడ రిలీఫ్ దక్కింది.

Also Read:Harishrao: కేసీఆర్ కల సాకారమైంది

- Advertisement -