జియో వినియోగదారులకు మరో షాక్‌..!

288
jio
- Advertisement -

వినియోగదారులకు టెలికం కంపెనీల బాదుడు షురూ అయ్యింది. ఇన్నాళ్లు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ వచ్చిన టెల్కోలు ఇప్పుడు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ఇప్పటి వరకూ మార్కెట్‌లో నడిచిన టారిఫ్లను టెలికం సంస్థలు ఒక్క సారిగా పెంచుతున్నాయి. ముందుగా టారిఫ్ లను పెంచుతామని ప్రకటించిన టెలికం కంపెనీలలో వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌టెల్ ఉన్నాయి.

అయితే వినియోగదారులకు ఎన్నో ఆఫర్స్‌ను ఇచ్చే జియో సంస్థ కూడా ఇప్పుడు వీటి బాటలోనే నడుస్తుంది. రానున్న రోజుల్లో టారిఫ్ ధరలు పెంచుతామని ప్రకటించింది. ఎంత మేర టారిఫ్‌ పెరగనుందనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది.

jio new

నెట్‌వర్క్ విస్తరణ, టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్లే టారిఫ్ పెంపునకు ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. మిగిలిన టెలికం కంపెనీలు వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ పెంపు ప్రకటన చేసిన తరువాతనే వారూ ఈ ప్రకటన చేశామని జియో సంస్థ స్పష్టం చేసింది.

కాగా జీవితాంతం కస్టమర్లకు ఏ నెట్‌వర్క్‌కు అయినా ఫ్రీ కాల్స్ అందిస్తామని చెప్పిన జియో ఇటీవలనే కస్టమర్లకు షాకిచ్చింది. ఇతర నెట్‌వర్క్ కాల్స్‌కు చార్జీలు వసూలు చేస్తోంది.

Reliance Jio, the country’s largest telecom operator,followed rivals Bharti Airtel and Vodafone Idea in plans to raise consumer tariffs..

- Advertisement -