జియో ఫైబర్‌ ప్లాన్స్‌ ఇవే..

530
- Advertisement -

జియో ఫైబర్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే రిజిస్ట్రర్ చేసుకున్న వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ హోం సొల్యూషన్ పొందనున్నారు. బేసిక్‌ స్పీడ్‌ 100 ఎంబీపీఎస్‌ కాగా.. గరిష్టంగా 1జీబీపీఎస్ వరకు బ్యాండ్‌ విడ్త్‌ను అందించనున్నట్లు తెలిపింది జియోకనిష్టంగా రూ.699, గరిష్టంగా రూ.8,499 చెల్లింపుతో వివిధ ప్లాన్లను ప్రవేశపెట్టింది జియో. ప్రతి ప్లాన్‌కు నెలవారీ, వార్షిక ప్లాన్ అంటూ వెసులుబాటు కల్పించారు.

jio-fiber

జియో ఫైబర్‌ ప్లాన్స్‌..

టైటానియమ్: ఇది కంప్లీట్ హైఎండ్ ప్లాన్. నెలవారీ చెల్లింపు అయితే రూ.8,499, వార్షిక ప్లాన్ అయితే రూ.1,01,988గా ధరలు నిర్ణయించారు. ఇందులో నెట్ స్పీడ్ 1జీబీపీఎస్ కాగా, 5000 జీబీ డేటా అందిస్తారు. దీంట్లో యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 43 అంగుళాల అత్యాధునిక 4కే టీవీ ఉచితం.

ప్లాటినమ్: ఈ ప్లాన్ లో నెలవారీ అయితే రూ.3,999, ఏడాది మొత్తానికి అయితే రూ.47,988 చెల్లించాలి. ఇందులో 1 జీబీపీఎస్ స్పీడ్ తో నెలకు 2500 జీబీ డేటా లభ్యమవుతుంది. ఇందులో వార్షిక ప్లాన్ వినియోగదారులకు 32 అంగుళాల హెచ్ డీ టెలివిజన్ ఫ్రీ.

డైమండ్: దీంట్లో నెలకు రూ.2,499, ఏడాది ప్లాన్ కు రూ.29,988గా నిర్ణయించారు. ఇందులో యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 24 అంగుళాల హెచ్ డీ టీవీ ఉచితంగా లభిస్తుంది. దీంట్లో నెట్ స్పీడ్ 500 ఎంబీపీఎస్. నెలకు 1500 జీబీ డేటా ఇస్తారు.

గోల్డ్: ఈ ప్లాన్ లో నెలకు 750 జీబీ డేటా లభిస్తుంది. నెట్ వేగం 250 ఎంబీపీఎస్. నెలవారీ అయితే రూ.1299, రెండేళ్ల మొత్తానికి అయితే రూ.31,176 చెల్లించాలి. రెండేళ్ల మొత్తానికి ఈ ప్లాన్ తీసుకుంటే 24 అంగుళాల హెచ్ డీ టీవీ ఉచితం.

సిల్వర్: ఈ ప్లాన్ కోసం నెలవారీ అయితే రూ.849, ఏడాది మొత్తానికి రూ.10,188 చెల్లించాలి. దీంట్లోనూ యాన్యువల్ ప్లాన్ కు బ్లూటూత్ స్పీకర్ ఫ్రీగా ఇస్తారు. ఇక దీని డేటా విషయానికొస్తే, 100 ఎంబీపీఎస్ వేగంతో నెలకు 400 జీబీ డేటా అందిస్తారు.

బ్రాంజ్: ఇది నెలకు రూ.699, ఏడాదికి రూ.3,388 చెల్లిస్తే అందుబాటులోకి వస్తుంది. దీంట్లో 100 ఎంబీపీఎస్ స్పీడ్ తో నెలకు 150 జీబీ డేటా ఇస్తారు. వార్షిక్ ప్లాన్ తీసుకున్నవారికి ఓ బ్లూటూత్ స్పీకర్ ఉచితం.

- Advertisement -