తొలి దశ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో బిజీగా ఉన్నారు నేతలు. పోలింగ్ కేవలం ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఇవాళ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఢిల్లీలోని కేంద్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ తదితర నేతలు పాల్గోన్నారు.
మేనిఫెస్టోలోని కొన్ని కీలక అంశాలు:
* రాజ్యాంగ విధివిధానాలకు లోబడి అన్ని వర్గాల ఆమోదంతో రామ మందిర నిర్మాణం
* పేద, మధ్య తరగతి రైతులకు పెన్షన్లు ఇస్తాం
* త్వరలో పౌరసత్వం అమలు బిల్లుకు ఆమోదం
* రైతులకు వడ్డీలేని రుణాలు, రైతు పెట్టుబడి సాయం కొనసాగింపు
* రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు
* అందిరికీ విద్యకు ప్రాధాన్యత, 75 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తాం
* కిసాన్ క్రెడిట్ కార్డుపై లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీతో రుణం
* 60 ఏళ్లు నిండిన సన్న, చిన్నకారు రైతులకు పింఛన్ పథకం
* వ్యవసాయ రంగానికి రూ. 25లక్షల కోట్ల కేటాయింపు
బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన మోదీ ..ముఖ్య హామిలు ఇవే
- Advertisement -
- Advertisement -