మాకు ఓ సజ్జనార్ కావాలి… తెలుగు హీరోయిన్ ఆవేదన..!

147
sajjanar
- Advertisement -

తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీలో ప్రేమోన్మాదులు పేట్రేగిపోతున్నారు. తమను ప్రేమించడం లేదనే కసితో అమాయక యువతులను కొందరు ప్రేమోన్మాదులు పాశవికంగా హత్య చేస్తున్నఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా ఆగస్టు 15 న గుంటూరులో జరిగిన రమ్యశ్రీ హత్య తెలుగు రాష్ట్రాలలో కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సరిగ్గా దేశమంతా స్వాతంత్ర దినోత్సవం సంబరాల్లో మునిగి పోయిన వేళ గుంటూరు కాకాని రోడ్ లో బీటెక్ చదువుతున్న రమ్య శ్రీ అనే విద్యార్థిని శశికృష్ణ అనే ప్రేమోన్మాది కత్తితో పొడిచి చంపాడు.

సోషల్‌ మీడియాలో రమ్యశ్రీకి పరిచయమైన నిందితుడు గత కొంత కాలంగా తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. శశికృష్ణ ఉన్మాది చేష్టలు గమనించిన రమ్యశ్రీ అతడిని దూరం పెట్టింది. ఇండిపెండెన్స్ డే నాడు ఇప్పుడే వస్తానని ఇంటిని నుంచి బయటకు వచ్చిన రమ్యశ్రీని నిందితుడు అడ్డుకున్నాడు. తనను ప్రేమించమని బెదిరించాడు. చాలా సేపు తన బైక్ ఎక్కమని బలవంతం పెట్టగా ఆమె అందుకు నిరాకరించింది. దీంతో ఉన్మాదిగా మారిన శశికృష్ణ. వెంట తెచ్చుకున్న కత్తితో రమ్యశ్రీని కిరాతకంగా పొడిచి చంపాడు. బీటెక్ విద్యార్థిని రమ్మశ్రీ హత్య ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో గంటల వ్యవధిలోనే ప్రేమోన్మాది శశికృష్ణ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించింది.

ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న శశి కృష్ణను తెలంగాణ తరహాలో ఎన్‌కౌంటర్ చేయాలని, మాకు ఓ సజ్జనార్ కావాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. తాజాగా రమ్యశ్రీ హత్యఘటనపై టాలీవుడ్ హీరోయిన్ రేఖబోజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రేఖ బోజ్ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. వాడ్ని కూడా అలాగే ఎవరైనా నరికేస్తే, ఆ నరికిన వాడితో పడుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. . im sry. ఆ వీడియో చూశాక ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. అంత నిస్సహాయతలో ఉన్నాము మేము ఈ రోజు. అంటూ రేఖ బోజ్ తన బాధను వ్యక్తం చేసింది. ప్రత్యూష హత్యాచార ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్‌‌పై కూడా రేఖ బోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు ఒక సజ్జనార్ సార్ కావాలి. రమ్యా నీకు న్యాయం జరగాలి… అంటూ రేఖ బోజ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక రేఖ బోజ్ విషయానికి వస్తే వినడానికి నార్త్ ఇండియన్ పేరులాగే ఉన్నా ఆమె పక్కా తెలుగు అమ్మాయి. వైజాగ్‌కు చెందిన ఈ భామ తెలుగు హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే కలయా తస్మై నమః, రంగీలా వంటి సిన్మాల్లో నటించిన రేఖ బోజ్‌కు ప్రస్తుతం దామిని విల్లా, స్వాతి చినుకు సందె వేళలో, మహి, వైశాలి వంటి సిన్మాల్లో హీరోయిన్ గా నటిస్తూ మాంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. మొత్తంగా రమ్యశ్రీని చంపిన వాడిని ఎవరైనా నరికేస్తా అతడితో పడుకుంటా అంటూ టాలీవుడ్ హీరోయిన్ రేఖ బోజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -